News March 24, 2025
కడప: యథావిధిగా ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం కడప కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్‌వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. జిల్లా అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
Similar News
News March 26, 2025
ఎర్రగుంట్ల: తల్లిదండ్రులు మృతి.. అనాథలైన పిల్లలు

ఎర్రగుంట్ల (M) కలమలలో భార్యాభర్తలైన రాజారెడ్డి(45) సుజాత(35)ను నిన్న వ్యాన్ ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. రాజారెడ్డికి ఇద్దరు అమ్మాయిలు. ఎర్రగుంట్లలో ఆర్టీపీపీలో కార్మికుడిగా పనిచేస్తూ వారిని చదివిస్తున్నాడు. పెద్దమ్మాయి బీటెక్ చదువుండగా, చిన్నకుమార్తె ఇంటర్ చదువుతోంది. దీంతో వారు అనాథలయ్యారని గ్రామస్థులు కన్నీరుమున్నీరు అయ్యారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ రూ.4 లక్షలు ఇచ్చారు.
News March 26, 2025
కడప: అనుమానంతో భార్యను చంపిన భర్త

వల్లూరు(M) అంబవరంలో భార్యను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. ఎర్రగుడిపాడుకు చెందిన చెన్నకేశవ, సుజాతకు పెళ్లై ముగ్గురు సంతానం. చెన్నకేశవ తాగుడుకు బానిసై భార్యపై అనుమానం పెంచుకొని వేధించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. సుజాతను పెద్దకొడుకు పనినిమిత్తం అంబవరానికి పిలుచుకొచ్చాడు. మంగళవారం సుజాతపై చెన్నకేశవ కొడవలితో దాడి చేసి చంపాడు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు.
News March 25, 2025
కడప: భార్యను చంపిన భర్త.. అనంతరం సూసైడ్

కడప జిల్లా వల్లూరు మండలంలో మంగళవారం దారుణ హత్య జరిగింది. అంబవరం ఎస్సీ కాలనీలో కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఎర్రగుడిపాడు చెన్నకేశవ భార్య సుజాతను విచక్షణా రహితంగా కత్తితో నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం చెన్నకేశవ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కమలాపురం సీఐ రోషన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.