News May 8, 2025

కడప: రిమ్స్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున

image

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.

Similar News

News January 29, 2026

ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అమలు చేయాలి: JC

image

ప్రజలు సంతృప్తి చెందేలా ప్రభుత్వ సేవలను అందించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా ఆదేశించారు. గురువారం కడప కలెక్టరేట్లో క్షేత్రస్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష చేపట్టారు. ప్రజారోగ్యం పారిశుధ్యం సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలని మాదకద్రవ్యాల నిరోధించాలని గ్రామ వార్డు సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించేలా చూడాలని స్పష్టం చేశారు.

News January 29, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.18,500
* బంగారం 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.17,020
* వెండి 10 గ్రాముల ధర రూ.4,000.

News January 29, 2026

కడపలో ఇంటిని కూల్చిన ఘటన update

image

కడపలోని ఎర్రముక్కపల్లి కందిపాలెంలో రెండు రోజుల కిందట ఇంటిని అర్ధరాత్రి కూల్చిన ఘటనలో ద్వారకనాథరెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు కడప వన్ టౌన్ సీఐ వి.చిన్నపెద్దయ్య తెలిపారు. ఇప్పటికే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంకా పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.