News August 31, 2025
కడప: రేషన్ కార్డుదారులకు ఉచితంగా జొన్నలు

చౌకా దుకాణాల ద్వారా సెప్టెంబరు నుంచి లబ్ధిదారులకు ఉచితంగా జొన్నలు అందించనున్నట్లు జేసీ అతిథి సింగ్ శనివారం తెలిపారు. బియ్యం కార్డులో ముగ్గరు సభ్యులు కన్నా తక్కువ ఉంటే ఒక కిలో మాత్రమే ఇస్తామన్నారు. సభ్యులు ఎక్కువ ఉంటే రెండు కిలోలు జొన్నలు బియ్యానికి బదులుగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంత్యోదయ, అన్నయోజన వారు కూడా అర్హులన్నారు.
Similar News
News September 1, 2025
కమలాపురం: లోకేశ్ పర్యటన ఇలా..!

మంత్రి నారా లోకేశ్ కమలాపురం నియోజకవర్గంలో ఈనెల 2వ తేదీన పర్యటించనున్నారు. ఉదయం10.30 గంటలకు పెండ్లిమర్రి డిగ్రీ కళాశాల భవనాలు ప్రారంభిస్తారు. 11.35కు కొప్పర్తిలో ఓ కంపెనీని ప్రారంభించి 12.20కి చింతకొమ్మదిన్నె మండలం జమాల్ పల్లెకు చేరుకుంటారు. సెంట్రల్ కిచెన్ ఓపెన్ చేసి మధ్యాహ్నం 2గంటలకు చింతకొమ్మదిన్నె మండలం కొలుమలపల్లెలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు.
News September 1, 2025
కడప: బాలికపై అత్యాచారయత్నం

కడప జిల్లా మైలవరం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదుగురు యువకులు గాలి మరల రిపేర్ పనుల కోసం వచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అందులో మహ్మద్ అలీ(35) అనే యువకుడు 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. అత్యాచార యత్నం చేయడంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 1, 2025
చక్రాయపేట: నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం

కడప జిల్లాలో ఆదివారం వినాయక నిమజ్జనం చేసి తిరుగు ప్రయాణం చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చక్రాయపేట మండలం మహాదేవపల్లె వాసులు గ్రామంలో గణనాథుని ఊరేగించి సమీప చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.