News March 10, 2025
కడప: వరల్డ్ నంబర్ 1 ర్యాంకింగ్ మనోడికే.!

ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన గొబ్బూరి విశ్వతేజ బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయస్థాయిలో రాణిస్తూ సత్తాచాటుతున్నాడు. తాజాగా జూనియర్ వరల్డ్ ర్యాకింగ్స్ డబుల్స్ విభాగంలో గుంటూరుకు చెందిన అరిగెల భార్గవ్ రామ్‌తో కలిసి వరల్డ్ నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈయన ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 3 మెడల్స్ సాధించగా.. జాతీయస్థాయిలో 17 పతకాలు సాధించాడు. కడప బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు ఆయన్ను సత్కరించారు.
Similar News
News March 10, 2025
భీమిలి: గుండెపోటుతో టీచర్ మృతి

భీమిలి జూనియర్ కాలేజీలో ఇంటర్ ఇన్విజిలేటర్ గా ఉన్న డి.మాధవరావు(55) పరీక్షా కేంద్రంలోనే గుండెపోటుతో మృతి చెందాడు. రేకవానిపాలెం ఎంపీపీ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఆయనకు ఇంటర్ ఇన్విజిలేషన్ విధులు అప్పగించారు. ఈమేరకు సోమవారం ఉ.8గంటలకు పరీక్షా కేంద్రంలో ఆయన కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
News March 10, 2025
HYD: సీఎంని కలిసిన అద్దంకి దంపతులు

సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ దంపతులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని కలిసి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను కాంగ్రెస్ ప్రకటించడంతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందించారు.
News March 10, 2025
WGL: ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ

వరంగల్ జిల్లాలోని పలు చోట్ల నేడు పొగమంచు కమ్ముకుంది. ఈ క్రమంలోనే నెక్కొండ మండలంలో ఈరోజు తెల్లవారుజామున పొలం పనులకు, స్కూళ్లకు, అవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. అలాగే మధ్యాహ్నం సమయంలో భానుడు సైతం తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని, ఎండ దంచి కొడుతుందని ప్రజలు తెలుపుతున్నారు. మండలంలో విచిత్ర వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు.