News August 22, 2024
కడప: ‘వాట్సప్ చేస్తే చర్యలు తీసుకుంటాం’

కడప జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ తీగలు, స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయని అనిపిస్తే వెంటనే వీడియో కానీ, ఫొటో తీసి 9440814264 నంబర్‌కు వాట్సప్ చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని విద్యుత్ ఎస్సీ రమణ తెలిపారు. విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక బృందం ద్వారా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా వాట్సప్ చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంతో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
Similar News
News February 15, 2026
కడప: ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర

కడప జిల్లా శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి. అందులో ప్రధానంగా పొలతల, నిత్యపూజకోన, సంగమేశ్వర ఆలయం, ముక్కొండ, పుష్కగిరి, అల్లాడుపల్లెలో వీరభద్ర స్వామి దేవాలయం, గవిమల్లేశ్వరుని కొండ, లంకమల మొదలైన వాటిలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో చరిత్ర ఉండగా వేలల్లో భక్తులు దర్శించుకుంటారు. ఇప్పటికే ఆయా దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పర్వదినాన మీరు ఏ గుడికి వెళ్తున్నారు.
News February 14, 2026
కడప: పోలీసులుగా చలామణి అవుతూ మోసం

కడప చిన్నచౌక్ పోలీసులు ఆన్‌లైన్‌లో POLO, WALLA యాప్‌లతో ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతపురానికి చెందిన చదువుల కుమార్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులుగా నటిస్తూ కేసులు పెట్టిస్తామని బెదిరించి, కేసుల నుంచి బయటపడేయాలంటే డబ్బులు ఇవ్వాలని నమ్మబలికి పలువురి నుంచి నగదు, బంగారం వసూలు చేసినట్లు విచారణలో బయటపడింది. వారి వద్ద రూ.4.5 లక్షల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
News February 14, 2026
గండికోటకు వెళ్తున్న ప్రేమ జంటకు ప్రమాదం.. యువతి మృతి.!

కడప నగర శివారులోని ఆలంఖాన్‌పల్లె సర్కిల్ వద్ద శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి గండికోటకు బైక్‌పై వెళ్తున్న ప్రేమజంటను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన సిరినా అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె ప్రియుడు గాయపడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. కడప 2-టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


