News September 5, 2024
కడప: ‘వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు’

వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రాంతాలలో ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గణేష్ నిమజ్జనం చేసే పాత కడప చెరువును భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో పరిశీలించారు. విగ్రహాలను ఎత్తే భారీ క్రేన్లను దానికి సంబంధించిన డ్రైవర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.
Similar News
News December 23, 2025
ప్రొద్దుటూరు: కనిపించని అమ్మవారి హారం

అగస్త్యేశ్వరాలయంలో అమ్మవారికి చెందిన 28.30 గ్రా. బంగారం హారం కనిపించలేదని జ్యూవెలరీ వెరిఫికేషన్ అధికారి పాండురంగారెడ్డి తెలిపారు. అలాగే 263.90 గ్రా. వెండి వస్తువులు కనిపించలేదన్నారు. ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయంలో 2 రోజుల పాటు అధికారులు బంగారు, వెండి ఆభరణాలను లెక్కించారు. రికార్డుల ప్రకారం 836 గ్రాముల బంగారు ఆభరణాలు, 141.625 కేజీలు వెండి వస్తువులు ఉండాలి. అయితే లెక్కింపులో తక్కువగా ఉన్నాయన్నారు.
News December 23, 2025
కడప: ఈ క్రాప్ సరే.. బీమా నమోదు ఎప్పుడు?

ఈ ఏడాది రబీ సీజన్లో జిల్లాలో 77,221 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. రైతులు సాగు చేసిన పంటలకు వ్యవసాయ సిబ్బంది ప్రస్తుతం ఈ క్రాప్ చేపడుతున్నారు. అయితే ప్రకృతి వైపరీత్యాల మధ్య పంటలు నష్టపోతే తగిన పరిహారం పొందేందుకు బీమా చేసుకోవాలని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో ఇంతవరకు NICP, పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News December 23, 2025
కడప జిల్లాలో పలువురు సీఐల బదిలీ

ఉమ్మడి కడప జిల్లాలో పలువురు సీఐలను DIG కోయ ప్రవీణ్ సోమవారం బదిలీ చేశారు. ఈ నెల 14న జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేశారు. వారం రోజుల్లోనే మళ్లీ సీఐల బదిలీలు జరిగాయి.
☛ సదాశివయ్య కడప 2టౌన్ నుంచి కడప SB-1కు బదిలీ
☛ ప్రసాదరావు గోనెగండ్ల నుంచి కడప 2టౌన్ బదిలీ
☛ వరప్రసాద్ అన్నమయ్య VR నుంచి అన్నమయ్య SC/ST సెల్‌కు బదిలీ
☛ మస్తాన్ అన్నమయ్య SC/ST సెల్ నుంచి కర్నూల్ సైబర్ సెల్‌కు బదిలీ అయ్యారు.


