News September 12, 2024

కడప: వృత్తి ధర్మాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి

image

వృత్తి ధర్మాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించడంతోపాటు మన ప్రాణాలకు ముప్పు రాకుండా విధి నిర్వహణను బాధ్యతను నిర్వర్తించాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్ రెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు. జాతీయ అటవీశాఖ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా కడపలో కార్యక్రమం నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.

Similar News

News February 8, 2026

గతంలోనూ ప్రొద్దుటూరు టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు.!

image

ప్రొద్దుటూరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై గతంలోనూ పలుమార్లు షోకాజ్ నోటీస్, సస్పెన్షన్, ఎంక్వైరీలు జరిగాయి. అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనపై చర్యలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన ACPలు మునిరత్నం, మునిచంద్రశేఖర్, TPO శివగురుమూర్తి, TPSలు ఇందిర, శిరీషా తదితరులపై చర్యలు చేపట్టారు. ACB, విజిలెన్స్ విచారణలు జరిగాయి. ప్రస్తుత ACP నాగరాజును శుక్రవారం సస్పెండ్ చేశారు.

News February 8, 2026

జమ్మలమడుగు: కన్యతీర్థం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?

image

జమ్మలమడుగు మండలంలోని పెద్దండ్లూరు వద్ద పెన్నా నదీ తీరాన భాను కొండల మధ్య సుమారు 5 వేల ఏళ్లకు పూర్వం ఈ క్షేత్రం వెలిసినట్లు ఆలయంలోని శాసనాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలోని పుష్కరిణిలో అలనాడు దేవకన్యకలు నిత్యం స్నానమాచరించి అమ్మవారిని సేవించుకోవడం వల్ల ఈ క్షేత్రానికి శ్రీకన్యతీర్థం అని పేరు వచ్చినట్లు పూజారులు చెబుతున్నారు. కన్యతీర్థం, తిరుపతి, శ్రీశైలం ఆలయంలో ఒకే ఆచారం, పోలికలు ఉండటం మరో విశేషం.

News February 8, 2026

ప్రొద్దుటూరులో ACP సస్పెండ్‌తో నైనా.. అధికారుల అవినీతి తగ్గేనా?

image

ప్రొద్దుటూరు ACP నాగరాజు సస్పెండ్‌తో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తి అవినీతి మయంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇళ్లు, షాపులు, అపార్ట్మెంట్లు, కాంప్లెక్సులు ప్రతి నిర్మాణానికి అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారట. మామూళ్ల వసూలు కోసం ఏజెంట్లను సైతం పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. కింది స్థాయి సిబ్బంది మొదలుకొని, TPO, ACP వరకు అందరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.