News January 15, 2026
కడప: వైట్ అండ్ వైట్‌లో మెరిసిన పోలీసులు

నిరంతరం విధి నిర్వహణలో భాగంగా డ్రెస్‌లో కనిపించే పోలీస్ అధికారులు భోగి పండుగ సందర్భంగా సాంప్రదాయ దుస్తులలో కనువిందు చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా భోగి మంటలు వేసి భోగి పండుగను స్వాగతించారు. జిల్లా ఎస్పీతో సహా పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా కనిపించారు.
Similar News
News February 18, 2026
ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగల కొనుగోలు: కలెక్టర్

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని, రబీ సీజన్‌కు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,875గా ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. కడప జిల్లాలో సుమారు 80,103 హెక్టార్లలో శనగ సాగు జరిగిందని పేర్కొన్నారు. రైతులు దళారుల మోసాలకు గురికాకుండా MSP ధరకు విక్రయించాలన్నారు. పులివెందుల, తొండూరు, JMD, ముద్దనూరు, కమలాపురం మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయన్నారు.

పులివెందులకు రానున్న వైఎస్ జగన్?

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 24, 25వ తేదీలలో పులివెందులలో పర్యటించనున్నట్లు సమాచారం. 24వ తేదీ పులివెందులకు చేరుకుని, 25వ తేదీ వేంపల్లి మండలం నందిపల్లెలోని నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.