News January 15, 2026
కడప: వైట్ అండ్ వైట్‌లో మెరిసిన పోలీసులు

నిరంతరం విధి నిర్వహణలో భాగంగా డ్రెస్‌లో కనిపించే పోలీస్ అధికారులు భోగి పండుగ సందర్భంగా సాంప్రదాయ దుస్తులలో కనువిందు చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా భోగి మంటలు వేసి భోగి పండుగను స్వాగతించారు. జిల్లా ఎస్పీతో సహా పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా కనిపించారు.
Similar News
News February 19, 2026
పోలీసులపై అంబటి రాంబాబు ఆగ్రహం

AP: నిన్న జైలు నుంచి విడుదలైన YCP నేత అంబటి రాంబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాజమండ్రి నుంచి గుంటూరుకు ఊరేగింపుగా వెళ్లొద్దని తెలిపారు. దీనిపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ’18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే ఏంటీ నిర్బంధాలు? నేనేమైనా ర్యాలీ తీస్తున్నానా? ఆంక్షలు ఎందుకు? 10 మంది కార్యకర్తలు వచ్చి నన్ను పలకరించడం తప్పా?’ అని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు.
News February 19, 2026
అమలాపురం: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు 40 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కె.చంద్రశేఖర్ బాబు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 13,131 మంది, ద్వితీయ సంవత్సరంలో 12,887 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే బాధ్యతను చీఫ్ సూపర్‌వైజర్లు, అధికారులే తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
News February 19, 2026
GNT: నిధుల వినియోగంపై ఆంక్షలు.. సర్పంచుల ఆవేదన

ఏప్రిల్ 2తో సర్పంచుల పదవీకాలం ముగియనున్న వేళ గ్రామాల్లో పనుల బిల్లులపై అనిశ్చితి నెలకొంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.70 కోట్లు ఉన్నా వాటిని విద్యుత్ బిల్లులు, చెత్త నిర్వహణకే పరిమితం చేశారు. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని సర్పంచులు అంటున్నారు. ఇప్పటికే చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంక్షలు సడలించాలని అంటున్నారు.


