News February 28, 2026
కడప: వైవీయూ కాన్వకేషన్ తేదీ మార్పు

యోగి వేమన విశ్వవిద్యాలయం 11, 12, 13, 14వ కాన్వకేషన్ నిర్వహణ తేదీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కార్యాలయ మార్గదర్శకం మేరకు స్వల్ప మార్పు చేసినట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. ముందుగా మార్చి 11వ తేదీ నిర్వహించాలని నిర్ణయించామని అయితే ఇదే నెల 13వ తేదీకి మార్చినట్లు చెప్పుకొచ్చారు. కాన్వకేషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ఈ మార్పును గమనించాలని కోరారు.
Similar News
News February 28, 2026
భద్రాద్రి: కో-ఆప్షన్ మెంబర్ పదవికై ఆశావాహుల ఆసక్తి

కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లందు మున్సిపాలిటీ, అశ్వారావుపేట మున్సిపాలిటీ పాలకవర్గం కొలువుతీరిన నేపథ్యంలో కో-ఆప్షన్ మెంబర్ ఎంపికకు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కో-ఆప్షన్ సభ్యులు ఎంపిక కొరకు నోటిఫికేషన్ విడుదల కాకముందే ఆశావాహులు తమను కో -ఆప్షన్ మెంబర్‌గా ఎంపిక అయ్యేలా చూడాలని నాయకుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. మరి నాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.
News February 28, 2026
మెట్రో రైల్ రికార్డు.. 80 కోట్ల ప్రయాణాలు పూర్తి

హైదరాబాద్ మెట్రో రైలు మరో మైలు రాయిని చేరుకుంది. నగరవాసులకు గమ్యాన్ని సుగమం చేసిన మెట్రో రైలు ప్రారంభం నుంచి ఇప్పటివరకు 80 కోట్ల ప్రయాణాలు పూర్తి చేసింది. 2017 నవంబర్‌లో ప్రారంభమైన ఈ సేవలు రోజు రోజుకీ నగర ప్రజల ఆదరణ పొందుతుంది. ప్రతిరోజూ 4.1 నుంచి 4.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ప్రతి నెలా 1.2 కోట్లకు పైగా ప్రయాణికులు మెట్రోను వినియోగిస్తున్నారు.
News February 28, 2026
గుంటూరు: MRI స్కాన్‌కి వెళ్తే.. నెల రోజులు ఆగాల్సిందే..!

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా C.T స్కాన్, MRI సేవలలో తీవ్రమైన రద్దీ నెలకొంది. ట్రామా వంటి అత్యవసర కేసుల్లో కీలకమైన MRI కోసం రోగులు 20–30 రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ ఆలస్యం వల్ల ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకుని సేవలను మెరుగుపరచాలని కోరుతున్నారు.


