News April 29, 2024

కడప: వైసీపీలోకి కాంగ్రెస్ నేత నజీర్ అహ్మద్

image

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నజీర్ అహ్మద్ ఆ పార్టీని వీడారు. వైఎస్ షర్మిల వచ్చాక కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని భరించలేక, మనస్తాపంతో కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరానన్నారు. ఆయనకు అవినాశ్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా, మేయర్ సురేశ్ బాబులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న తనను అవమానపరిచారని ఆరోపించారు.

Similar News

News July 5, 2025

కడప: భార్యను హత్యచేసిన భర్త.. జీవిత ఖైదు

image

కడప తాలూకా PS పరిధిలోని ఏఎస్ఆర్ నగర్‌లో ఉండే ముద్దాయి మల్లికార్జునకు జీవిత ఖైదీతోపాటు రూ.లక్షా 60వేల జరిమానాను విదిస్తూ కడప ఏడవ ఏడిజే కోర్టు జడ్జి రమేశ్ శుక్రవారం తీర్పునిచ్చారు. కడపకు చెందిన యువతి గంగాదేవితో మల్లికార్జునకు 2012లో వివాహమైంది. అప్పటినుంచి ఆమెపై అనుమానంతో చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఈ క్రమంలో 03/03/2019లో ఆమె గొంతు నులిమి హత్య చేసినందుకు గాను శిక్ష పడింది.

News July 5, 2025

కడప: పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్‌పై విచారణ

image

కడప పరిశ్రమల శాఖలో గతంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన కె.కృష్ణమూర్తిపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కొప్పర్తి పరిశ్రమల అధ్యక్షుడు జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉషశ్రీని విచారణాధికారిగా, ఈశ్వరచంద్‌ను ప్రెజెంటింగ్ అధికారిగా నియమిస్తూ GO జారీ చేసింది.

News July 5, 2025

పోరుమామిళ్ల: హత్య కేసులో పదేళ్ల జైలు శిక్ష

image

ఆరేళ్ల క్రితం పోరుమామిళ్ల PS పరిధిలోని రామాయపల్లి గ్రామ సమీపంలో ఓ మతిస్థిమితం లేని యువతి హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలు జిలాని బాషా, నాగేంద్ర ప్రసాద్, మహబూబ్ బాషాలకు పదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఎ.డి.జే కోర్టు జడ్జి దీనబాబు శుక్రవారం తీర్పునిచ్చారు. యువతిని గొంతు నులిమి హత్య చేయగా అప్పటి నుంచి విచారణ చేసిన పోలీసులకు సరైన సాక్షాధారాలు దొరకడంతో ముద్దాయిలకు శిక్ష పడింది.