News March 24, 2024
కడప: వైసీపీ నాయకుడిపై కేసు నమోదు

కడప 3వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ సుదర్శన్‌రెడ్డిపై రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. డివిజన్లో ఒక హోటల్‌ను వైసీపీ నాయకులచే ప్రారంభించారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన బెలూన్లు వైసీపీ జెండా రంగులను పోలి ఉన్నాయని సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ పార్థసారథి అభ్యంతరం వ్యక్తం చేసి రూ.10వేలు అపరాధ రుసుం విధించారు. ఈ క్రమంలో జరిగిన వాదులాటలో ఆర్ఓ ఆదేశాల మేరకు ఇతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 10, 2025
ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి బస్సు సర్వీసులు

ఒంటిమిట్టలో జరగనున్న కోదండ రామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా 11వతేదీ 145 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ కడప రీజనల్ మేనేజర్ గోపాల్ రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి 35, పులివెందుల 12, బద్వేలు 22, జమ్మలమడుగు 12, మైదుకూరు 7, ప్రొద్దుటూరు 17తో పాటు ఇతర డిపోలు (రాయచోటి, రాజంపేట) నుంచి మరో 40 బస్సులు ఒంటిమిట్టలో కల్యాణోత్సవం జరిగే ప్రాంతం వరకు చేరుకుంటాయన్నారు.
News April 10, 2025
జమ్మలమడుగు: అది ప్రమాదం కాదు.. హత్యే.!

జమ్మలమడుగు-ముద్దనూరు రోడ్డులో మార్చి 24న ప్రమాదంలో గుడెంచెరువుకు చెందిన కిశోర్ బాబు మృతిచెందాడు. ఈ యాక్సిడెంట్‌ను పక్కా ప్లాన్‌తో ఉదయ్ కుమార్ చేశాడని CI లింగప్ప బుధవారం తెలిపారు. మార్చి 20న కిశోర్ బాబు మేనమామ కిరణ్ తల్లి దినం కార్యక్రమంలో ఉదయ్ కుమార్ భార్యను కిశోర్ కొట్టాడని వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని పక్కాప్లాన్‌తో యాక్సిడెంట్ చేశాడని CI తెలిపారు.
News April 9, 2025
ఒంటిమిట్ట కళ్యాణ వేడుక ఏర్పాట్ల పరిశీలన

11వ తేదీన జరగబోయే ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని కళ్యాణం వేడుకకు సంబంధించి పటిష్టమైన ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఒంటిమిట్ట కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు సిబ్బందికి కలెక్టర్ సూచించారు.