News September 27, 2024

కడప: వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు

image

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనలో భాగంగా కడప జిల్లా వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. తిరుపతి 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో లాంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

Similar News

News September 15, 2025

కడప ఎంపీ.. హాజరులో చివరి స్థానం

image

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరులో 54.41 శాతంతో చివరి స్థానంలో ఉన్నారు. 80 ప్రశ్నలను సభలో అడిగగా.. 5 చర్చల్లో మాత్రమే ఆయన పాల్గొన్నారు.

News September 15, 2025

కడప: తండ్రి కోసం ఐపీఎస్ అయ్యాడు.!

image

తన తండ్రి కలను తీర్చడానికి కష్టపడ్డ వ్యక్తి కడప జిల్లా నూతన SP నచికేత్ షలేకే. ఈయన పూణేలోని ప్రింళై గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు విశ్వనాథ్, చంద్రసేన ఇద్దరూ ఉపాధ్యాయులే. తాను ఐపీఎస్ కావడం తన తండ్రి కల అని, దాని కోసం చాలా కష్టపడ్డానని ఓ ఇంటర్వూలో ఆయన పేర్కొన్నారు. రెండు సార్లు విఫలం చెంది 2019లో మూడో ప్రయత్నంలో సివిల్స్‌లో సెలెక్ట్ అయ్యారు. ఇవాళ 10 గంటలకు కడప ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

News September 15, 2025

కడప జిల్లాలో 46 మంది పోలీస్ సిబ్బంది బదిలీ.!

image

కడప జిల్లాలో 46 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 39 మందికి స్థాన చలనం కలిగించారు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు బదిలీ చేశారు. మరో ఏడుగురికి అటాచ్మెంట్ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా శనివారం ఎస్పీతోపాటు పలు జిల్లాల ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది.