News April 4, 2024
కడప: శ్రీనివాస్ యాదవ్ హత్య కేసులో సిట్ ఏర్పాటు

పెండ్లిమర్రి మండలం యాదవాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు హత్య కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో అడిషనల్ SP వెంకట్రాముడు నేతృత్వంలో SP సిద్దార్థ్ కౌశల్ సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెండ్లిమర్రి ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డిని వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News December 25, 2025
క్యాలెండర్‌ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ క్రిస్మస్ సందర్భంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఏసుప్రభువును ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News December 25, 2025
జగన్‌కు ముద్దు పెట్టిన విజయమ్మ

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ తరుణంలో జగన్ తల్లి విజయమ్మ ఆయనకు కేక్ తినిపించి ముద్దు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి.
News December 25, 2025
మాజీ మంత్రి బిజీ వేముల వీరారెడ్డి వర్ధంతి నేడు.!

బద్వేల్ మండలంలోని చెన్నకేశం పల్లె అనే గ్రామంలో జన్మించిన బిజీ వేముల వీరారెడ్డి సర్పంచ్ స్థాయి నుంచి క్యాబినెట్ మంత్రి స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన కడప జిల్లా టీడీపీ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించాడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా తన సేవలు అందించి బద్వేల్ ప్రాంత రైతాంగానికి వరప్రసాదమైన తెలుగు గంగ ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశాడు. ఇప్పటికి ఆయన మరణించి 25 సంవత్సరాలు అవుతోంది.


