News December 24, 2024

కడప: సంక్రాంతికి 294 ప్రత్యేక బస్సులు

image

సంక్రాంతిని పురస్కరించుకుని ఉమ్మడి కడప జిల్లాలోని 6 RTC డిపోల పరిధిలో 294 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. జనవరి 9 నుంచి13 వరకు సాధారణ చార్జీలతో ఈ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఆర్టీసీ RM గోపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి 111, బెంగళూరు నుంచి 81, విజయవాడ నుంచి 30, చెన్నై నుంచి 12, ఇతర ప్రాంతాల నుంచి 60కలిపి మొత్తంగా 294 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందన్నారు.

Similar News

News December 25, 2024

రాజంపేట YCP నేత సుబ్బారెడ్డి అరెస్ట్

image

రాజంపేట మండలం గుండ్లూరు వద్ద ఒంటిమిట్ట మండలానికి చెందిన బ్రహ్మయ్యపై దాడి కేసులో నందలూరు జడ్పీటీసీ గడికోట ఉషారాణి భర్త YCP నేత సుబ్బారెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన వర్గీయులతో కలిసి బ్రహ్మయ్యను కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సుబ్బారెడ్డితోపాటు మరో 6మందిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

News December 25, 2024

ఒంటిమిట్ట విమాన గోపుర నిర్మాణానికి ఆమోదం

image

ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో విమాన గోపురంలో బంగారు కలశం నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈరోజు తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో బంగారు కలశం నిర్మాణానికి సంబంధించి 43 లక్షల రూపాయలతో చేపట్టడానికి పాలకమండలి సభ్యులు ఆమోదం తెలిపారు.

News December 24, 2024

కుటుంబంతో సరదాగా వైఎస్ జగన్

image

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నాలుగు రోజులు జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ కుటుంబంతో ఇడుపులపాయ నందు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగన్ పెదనాన్న, చిన్నాన్న కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫొటోలో జగన్‌తో పాటు తల్లి విజయమ్మ, ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి, వైఎస్ భారతి, యువరాజ్, జగన్ కుమార్తెలు హర్ష, వర్ష తదితరులు ఉన్నారు.