News March 26, 2024
కడప: సీఎం వైఎస్ జగన్ పర్యటన వివరాలు

సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం 12 :20 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం హెలికాఫ్టర్ లో బయలుదేరి 12:45కు ఇడుపులపాయకు చేరుకుంటారు. అనంతరం వైఎస్ఆర్ ఘాట్ వద్ద 1:20 వరకు ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటారు. 1:30 కు ఇడుపులపాయలో బయలుదేరి వేంపల్లి, వీఎన్ పల్లె, ఎర్రగుంట్ల మీదుగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
Similar News
News April 9, 2025
పులివెందుల: MLC V/S మాజీ MLC

కడప జిల్లాలో TDPని బలోపేతం చేయాలనే ఆ పార్టీ పెద్దల ఆకాంక్ష.. స్థానిక నేతల వర్గపోరుతో తీరేలా కనిపించడం లేదు. ఈ మధ్య కాలంలో మాజీ MLC బీటెక్ రవి, MLC రాంగోపాల్ రెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్యం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల వీరి వర్గీయులు ఘర్షణలకు దిగారు. మంగళవారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత ఎదుటే ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. దీంతో జిల్లా TDP సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
News April 8, 2025
ఒంటిమిట్ట: కళ్యాణోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఎక్కడా ఇబ్బందులు జరగకుండా పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.
News April 8, 2025
అరటి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి సవిత

ఇటీవల కురిసిన వర్షానికి అరటిపంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జేసీ అతిధి సింగ్‌తో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించే విధంగా నివేదికలు తయారు చేయాలని సూచించారు.