News March 22, 2026

కడప: సీఐ అశోక్‌రెడ్డిపై ‘నాన్‌ బెయిలబుల్‌’ కేసు..!

image

గతంలో చిన్నచౌకు, చింతకొమ్మదిన్నె స్టేషన్లలో సీఐగా పనిచేసిన అశోక్‌రెడ్డిపై నమోదైన నాన్‌ బెయిలబుల్‌ కేసు పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆస్తుల సెటిల్మెంట్ల కోసం తనను బెదిరించడమే కాకుండా, రెండు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారంటూ అనంతపురానికి చెందిన బాధితుడు ప్రభాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు చింతకొమ్మదిన్నె పోలీసులు సీఐపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 14, 2026

జగిత్యాల: భవన నిర్మాణ కూలీగా ప్రభుత్వ టీచర్

image

11 ఏళ్లు వీఆర్‌ఏగా పనిచేసిన JGTL(D) కొడిమ్యాల (M) చెప్యాలకు చెందిన లక్ష్మీరాజం, ఉపాధ్యాయుడిగా ఎంపికై ఎనిమిది నెలలకే ఆ కొలువు కోల్పోయారు. ఆర్‌సీఐ వెరిఫికేషన్ సమస్యతో అధికారులు ఆయన్ను తొలగించడంతో, ప్రస్తుతం కుటుంబ పోషణకు భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు. అటు పాత ఉద్యోగం లేక, ఇటు టీచర్ కొలువు పోయి రోడ్డున పడ్డానని, తనకు న్యాయం చేయాలని ఆయన సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌ను వేడుకున్నారు.

News April 14, 2026

ఇంటర్ ఫలితాలు.. 13 మంది ఆత్మహత్య

image

తెలంగాణ ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఏడుగురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు.. సిద్దిపేట, HYD, మేడ్చల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, MBNR, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు.

News April 14, 2026

చిత్తూరు: ఈ ప్రాంతాలలో కోళ్ల రవాణా నిషేధం

image

సదుం మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి, కార్వేటి నగరం మండలంలోని RKVB పేట నుంచి కోళ్ల రవాణా నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో ఈ ప్రాంతాలలో కోళ్లకు బర్డ్ ప్లూ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు నెలలపాటు ఈ ప్రాంతాలలో నమూనాలు తీసి టెస్టింగ్‌కు పంపనున్నారు. అన్నింటిలో నెగటివ్ వస్తేనే కోళ్ల పెంపకానికి అనుమతించనున్నారు.