News June 7, 2024
కడప స్టీల్ ప్లాంట్ ఇప్పుడైనా ఏర్పాటయ్యేనా?: తులసిరెడ్డి
విభజన సందర్భంగా ప్రకటించిన కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఇప్పటికైనా ఏర్పాటయ్యేనా.. అని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుంది కడప జిల్లాలోని నిరుద్యోగ యువత పరిస్థితి అన్నారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కారించాలన్న సత్సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2014, సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ మంజూరయిందన్నారు.
Similar News
News January 16, 2025
కడప: ఇక పట్నం పోదాం..!
ఉమ్మడి కడప జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులు పండగ కోసం తరలి వచ్చారు. మూడు రోజులు ఎంతో ఎంజాయ్ చేశారు. నిన్న రాత్రి నుంచే పలువురు తిరిగి తమ ఉద్యోగాలకు బయల్దేరారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. రాయచోటి నేతాజీ సర్కిల్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో బస్సుల కోసం ఇలా ప్రయాణికులు వేచి చూశారు.
News January 16, 2025
తిరుమలలో కడప బాలుడి మృతి
తిరుమలలో కడప బాలుడు చనిపోయాడు. చిన్నచౌక్ ఏరియాకు చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు 13వ తేదీన తిరుపతికి వెళ్లారు. వాళ్లకు 16వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కేటాయించారు. ఈక్రమంలో తిరుమల బస్టాండ్ సమీపంలో లాకర్ తీసుకున్నారు. నిన్న సాయంత్రం వారి రెండో కుమారుడు సాత్విక్ శ్రీనివాస్ రాజు(3) ఆడుకుంటూ రెండో అంతస్తు నుంచి పడిపోయాడు. కొండపై ఉన్న అశ్విని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
News January 15, 2025
యర్రగుంట్లలో సంక్రాంతి రోజు అపశ్రుతి
యర్రగుంట్లలోని 5వ వార్డులో జయంత్ అనే ఐదేళ్ల బాలుడు విద్యుత్ తీగలు తగిలి మంగళవారం గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉండే నాగిరెడ్డి ఇంటిపై 33KV విద్యుత్ తీగలు కిందికున్నాయి. ఆ మిద్దెపైన ఆడుకుంటున్న జయంత్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు బాబును ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఇదే క్రమంలో నాగిరెడ్డి ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి నష్టం వాటిల్లింది.