News August 29, 2025
కడప స్టీల్ ప్లాంట్ పనులకు రూ.25 కోట్లు విడుదల

కడప స్టీల్ ప్లాంట్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.25 కోట్లు విడుదల చేసింది. గతంలో YSR స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులకు రూ.25 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ GO.Rt.No.138 విడుదల చేశారు. YSR స్టీల్ కార్పొరేషన్ భూములను, మౌళిక సదుపాయాలను ఇటీవల జిందాల్ స్టీల్ ప్లాంటుకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ పనులకు ఇప్పుడు రూ.25 కోట్లు ఇచ్చారు.
Similar News
News August 29, 2025
కడప: వినాయక నిమజ్జనంలో అపశృతి

కడప జిల్లాలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. బాణాసంచా పేలి నలువురికి గాయాలయ్యాయి. బ్రహ్మంగారిమఠం మండలం రేకలగుంట పంచాయతీ బాగాది పల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాణసంచా పేలి గ్రామానికి చెందిన పాల కొండయ్య, జగదీశ్, లోకేశ్, దుక్కేశ్ గాయపడ్డారు. గాయపడిన వారిని 108లో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News August 29, 2025
హరికృష్ణకు కడపతో ప్రచార అనుబంధం

దివంగత మాజీ ఎమ్మెల్యే నందమూరి హరికృష్ణ మన మధ్య లేకపోయినా కడప వాసులు మరిచిపోలేరు. దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 1982 ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు, చౌటపల్లి వచ్చిన సమయంలో చైతన్య రథాన్ని హరికృష్ణ నడిపారు. మళ్లీ 1992లో రెండోసారి కొండాపురం, పులివెందుల, కడప తదితర ప్రాంతాలలో రోడ్ షోలో పాల్గొన్నారు. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఆనాటి రోజులు నెమరివేసుకుంటున్నారు.
News August 29, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు 30నుంచి వైద్య పరీక్షలు: ఎస్పీ

కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఈనెల 30నుంచి వైద్య పరీక్షలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరు కావాలని ఎస్పీ అశోక్ కుమార్ గురువారం తెలిపారు. ఈనెల 30న రిజిస్టర్ నంబర్ 4001160 నుంచి 4155879 వరకు, సెప్టెంబర్ 1న నంబర్ 4156636 నుంచి 4299199 వరకు, సెప్టెంబర్ 2న నం: 4299250 నుంచి 4504602 వరకు సివిల్, అదేరోజు నం: 4002777 నుంచి 4468576 అభ్యర్థులు హాజరవ్వాలని సూచించారు.