News October 10, 2025

కడప: ‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిబ్బంది సన్నద్ధంగా ఉండాలి’

image

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నయని, సిబ్బంది సన్నద్దం కావాలని ఎస్పీ విశ్వనాథ్ అన్నారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో క్రైమ్‌పై సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిబ్బంది కృషి చేయాలని, పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల భద్రత, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News October 10, 2025

కడప: క్రికెటర్ కావాలని ఉందా?

image

క్రికెట్‌పై ఆసక్తి ఉన్నవారితో టాలెంట్ హట్ నిర్వహిస్తామని కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.రెడ్డి ప్రసాద్ తెలిపారు. బాగా ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ కిట్, ఆధార్ కార్డు, బర్త్, స్టడీ సర్టిఫికెట్, ఓ ఫొటోతో కడపలోని YSR ACA క్రికెట్ స్టేడియానికి రావాలని సూచించారు. 13న అండర్-12, 14న అండర్-14, 15న అండర్-16, 16న అండర్-19 క్రీడాకారులు రావాలి.

News October 10, 2025

RSK కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్

image

జిల్లాలో తొలి ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్‌లో వ్యవసాయ, సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రైతులు దళారుల మాటలు నమ్మి నష్టపోవద్దన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం RSK కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు.

News October 9, 2025

కడప: యూజీసీ నెట్ అర్హత గల వారికి పీహెచ్డీలో ప్రవేశాలు

image

యూజీసీ నెట్ అర్హత సాధించిన వారికి యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీహెచ్డీలో నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. యూజీసీ నెట్ ఫెలోషిప్, లెక్చరర్స్షిప్, పీహెచ్డీ క్వాలిఫై అయిన అభ్యర్థులు yvu.edu.inను సందర్శించి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తును ఈ నెల 15వ తేదీ లోపు వైవీయులో అందజేయాలన్నారు.