News January 21, 2025
కడప: హత్యాయత్నం కేసులో 12 మందికి జైలు శిక్ష

వీరపునాయునిపల్లె మండలంలో 2014లో గుమ్మిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో 12 మందిపై నేరం రుజువైంది. దీంతో ప్రొద్దుటూరు కోర్టు ముద్దాయిలకు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.35వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. అప్పటి ఎస్ఐ రోషన్ కేసు నమోదు చేయగా.. నేరం రుజువు కావడంతో సోమవారం కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Similar News
News February 28, 2026
ప్రొద్దుటూరు అవినీతి అధికారుల గుండెల్లో గుబులు.!

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంకు అవినీతిపై పూర్వక మేనేజర్ ప్రవీణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఇతర శాఖల్లోని ఇంటి దొంగలు ఆందోళన చెందుతున్నారు. వీరిపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు మొదట పెట్రోల్ బంక్ అవినీతిపై కేసు నమోదయింది. మున్సిపల్, హౌసింగ్, హౌస్ బిల్డింగ్ సొసైటీ, శివాలయంలో అవినీతిపై కేసుల నమోదుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది.
News February 28, 2026
అక్రమ గల్ఫ్ ఏజెంట్లపై కడప ఎస్పీ కొరడా

మహిళలను టూరిస్ట్ వీసాలపై గల్ఫ్ పంపి మోసగిస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నచికేత్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలు కేవలం రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలి అన్నారు. గల్ఫ్‌లో ఇబ్బంది పడుతున్నవారు ‘Madad’ పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. దళారుల సమాచారం తెలిస్తే 9121100504, 9121100652 నంబర్లకు తెలపాలన్నారు.
News February 28, 2026
’60 ఏళ్ల స్నేహం’ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కంటతడి

రాజుపాలెం (M)లోని కొర్రపాడు గ్రామానికి చెందిన మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యుడు కమాలుద్దీన్ అనారోగ్యంతో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొర్రపాడు గ్రామానికి చేరుకుని కమాలుద్దీన్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కమాలుద్దీన్‌తో 60 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ “మంచి మిత్రుడిని కోల్పోయాను” అని కంటతడి పెట్టారు.


