News August 13, 2024
కడప: 14న కలెక్టరేట్లోఉద్యోగ మేళా

కడప జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 14న కడప కలెక్టరేట్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయ ఆవరణలో ఉదయం పది గంటలకు మొదలయ్యే ఈ ఉద్యోగ మేళాకు పదో తరగతి, అంతకు పైన విద్యార్హత కలిగిన యువతీ-యువకులు తమ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
Similar News
News July 10, 2025
కడప MLA తీరుపై విమర్శలు

మొహర్రం సందర్భంగా నాదర్ షావలీ దర్గా ఉరుసు నిర్వహించారు. ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం కేసీ కెనాల్లో రొట్టెలు వదిలారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చెప్పులు వేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంతో పవిత్రంగా రొట్టెలు వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే చెప్పులు ధరించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని పలువురు అంటున్నారు.
News July 9, 2025
కడప: మెరిట్ ఆధారంగా నేరుగా అడ్మిషన్లు

కడపలోని డా. వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి బి.డిజైన్, బి.ఎఫ్.ఎ కోర్సులలో మెరిట్ ఆధారిత డైరెక్ట్ అడ్మిషన్లకు ఏపీఎస్ఎచ్ఈ అనుమతి లభించిందని వీసీ ప్రొఫెసర్ జి. విశ్వనాథ్ కుమార్ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News July 9, 2025
ముద్దనూరులో యాక్సిడెంట్

ముద్దనూరులోని కొత్తపల్లి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగింది. రాజంపేట నుంచి తాడిపత్రి వైపు వెళుతున్న బొలేరో క్యాంపర్ మినీ లారీ ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. దీంతో బొలేరోలో ఉన్న రజాక్, గోవిందమ్మ, శివమ్మ, మరొకరికి గాయాలయ్యాయి. వారిని ముద్దనూరు 108 వాహన సిబ్బంది సుబ్రహ్మణ్యం ప్రొద్దుటూరు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.