News March 27, 2025

కడప: 98 ఏళ్ల వయసులోనూ ఓటేసిన జడ్పీటీసీ

image

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో ఓ స్ఫూర్తిదాయక దృశ్యం కనిపించింది. గురువారం కడప నగరంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఛైర్మన్ ఎన్నికలో ఉమ్మడి కడప జిల్లా గాలివీడు జడ్పీటీసీ షేక్ భానూ బీ 98ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలో ప్రతి ఓటు కీలకం అయిన నేపథ్యంలో ఆమె ఓటు వేసి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

Similar News

News March 30, 2025

నారా లోకేశ్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం: సోమిరెడ్డి చంద్రమోహన్

image

AP: పార్టీలో రెండు టర్మ్‌లు ఓ పదవిలో పనిచేసినవారు పై స్థాయికి వెళ్లాలి లేదా టర్మ్ గ్యాప్ తీసుకోవాలన్న మంత్రి లోకేశ్ ప్రతిపాదనకు TDP సీనియర్లు మద్దతు పలికారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ పేర్కొన్నారు. ‘లోకేశ్ ప్రతిపాదనకు మద్దతునిస్తున్నాం. 2012 నుంచి నేను టీడీపీ పొలిట్‌బ్యూరోలో ఉన్నాను. నా స్థానంలో వేరొకరికి అవకాశమివ్వాలనుకుంటే నేను సిద్ధం’ అని పేర్కొన్నారు.

News March 30, 2025

సూర్యాపేట: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై మంత్రి సీతక్క ఫైర్

image

రాష్ట్రానికి కాంగ్రెస్ కరప్షన్ వైరస్ సోకిందని, రాష్ట్రంలో సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో హుజూర్ నగర్‌కు వెళ్తుండగా మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12సంవత్సరాల్లో సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదో చెప్పాలన్నారు.

News March 30, 2025

నంద్యాల: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ రద్దు

image

నంద్యాల పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆదిరాజు సింగ్ రాణా తెలిపారు. సోమవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం రద్దు అయినట్లు ఎస్పీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. వచ్చే సోమవారం యధావిధిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

error: Content is protected !!