News May 6, 2024
కడప: MLA అభ్యర్థి వాహనంపై దాడి

ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే అభ్యర్థి వాహనంపై దాడి జరిగింది. మాజీ మంత్రి వివేకా హత్య అప్రూవర్, జై భీంరామ్ భారత్ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి వాహనంపై పులివెందులలో కొందరు అల్లరి మూకలు దాడి చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచార వాహనం ముద్దనూరు మీదగా వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు అల్లరిమూకలను చెదరొట్టారు.
Similar News
News November 13, 2025
కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం.. కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న చిన్న సుంకిరెడ్డికి ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కడప రిమ్స్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల(M) భీమునిపాడుకు చెందిన వ్యక్తిగా అధికారులు వెల్లడించారు.
News November 13, 2025
కడప జిల్లాలో 13,681 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై విచారణ!

జిల్లాలో 14 అర్బన్ మండలాల్లో 13,681 ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలపై అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం నాటికి 9,612 ఇళ్ల నిర్మాణాలను ప్రత్యేక యాప్ ద్వారా పరిశీలించారు. వాటి నిర్మాణాల వివరాలు ఫొటోలతో నమోదు చేశారు. YCP ప్రభుత్వంలో ఈ ఇళ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టారు. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. అప్పట్లో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
News November 12, 2025
మదనపల్లి కిడ్నీ రాకెట్‌లో దొరికింది వీరే.!

అన్నమయ్య జిల్లాలో కిడ్నీలు కొట్టేసే ముఠాను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. విశాఖకు చెందిన ఓ మహిళకు మదనపల్లెలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో <<18262668>>కిడ్నీ తొలగించగా చనిపోయింది<<>>. దీంతో వారు మృతదేహాన్ని తిరుపతికి తరలించి దహనక్రియలు చేయాలని చూశారు. ఈలోగా మృతురాలి భర్త తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గుట్టు రట్టైంది. అక్కడ కేసు నమోదుచేసి మదనపల్లెకు ట్రాన్స్‌ఫర్ చేయగా ఆ ముఠాలోని దొంగలు పట్టుబడ్డారు.


