News April 2, 2026
కడప: YVUలో ఉద్యోగాలు

కడప YVU పీజీ కళాశాల కామర్స్ శాఖలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు ప్రొ శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు ఎం.ఎస్.సి (కంప్యూటర్ సైన్స్) /ఎం.సి.ఎ./ ఎం.టెక్. కంప్యూటర్స్ అర్హత ఉండాలన్నారు. నెట్/ సెట్/ పీహెచ్డీ అర్హత కలిగినవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. వివరాల కోసం www.yvu.edu.inని సందర్శించాలన్నారు.
Similar News
News April 2, 2026
కడప జిల్లాలో నీటి పన్ను వసూళ్లు ఎంతంటే.?

కడప జిల్లాలో మునిసిపాలిటీల్లో గత ఆర్థిక సంవత్సరంలో నీటి పన్ను డిమాండ్ రూ.37.18 కోట్లు కాగా.. మార్చి 31 నాటికి రూ.16.95 కోట్లు (45.59%) వసూలైంది.
మున్సిపాలిటీ వారీగా నీటి పన్ను డిమాండ్ వసూళ్ల వివరాలు (రూ.కోట్లల్లో).
*కడప-15.51-9.08, ప్రొద్దుటూరు-6.91-3.14.
*పులివెందుల-4.80-1.37, బద్వేల్-4.11-0.66.
*జమ్మలమడుగు-2.74-1.01, మైదుకూరు-1.55-0.67.
*ఎర్రగుంట్ల-0.85-0.40, కమలాపురం-0.66-0.23 కోట్లు.
News April 2, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.15,060
*22 క్యారెట్ బంగారం 1గ్రాము ధర రూ.13,855
*వెండి 10 గ్రాముల ధర రూ.2,335
News April 2, 2026
కడప జిల్లాలో ఆస్తి పన్ను వసూళ్లు ఎంతంటే.?

కడప జిల్లాలోని మున్సిపాలిటీల్లో గత ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను డిమాండ్ రూ.175.56 కోట్లు కాగా.. మార్చి 31 నాటికి రూ.99.40 కోట్లు(56.62%) వసూలైంది. మున్సిపాలిటీ వారీగా (రూ. కోట్లలో).
*కడప-110.41-58.79(53.24%)
*ప్రొద్దుటూరు-36.10-21.04(58.28%)
*పులివెందుల-11.48-7.54(65.65%)
*జమ్మలమడుగు-5.95-4.21(70.83%)
*ఎర్రగుంట్ల-5.43-2.65(48.89%)
*మైదుకూరు-5.00-2.47(49.44%)
*కమలాపురం-1.18-0.59(49.86%)


