News April 2, 2025
కడవెండికి చేరుకున్న మావోయిస్టు రేణుక మృతదేహం

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన ఎడిటర్ ప్రభాత్ పత్రిక సంపాదకురాలు గుమ్మడివెల్లి రేణుక ఎన్‌కౌంటర్‌లో సోమవారం మృతి చెందారు. కాగా, బుధవారం తెల్లవారుజామున సొంత గ్రామం కడవెండికి రేణుక మృతదేహం చేరుకుంది. మధ్యాహ్నం అంతిమ యాత్ర ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. కామ్రేడ్ రేణుకను కడసారి చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారని పేర్కొన్నారు.
Similar News
News April 3, 2025
ఆ పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ పి.జగదీశ్

సామాజిక మాధ్యమాల్లో కులాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పి.జగదీశ్ హెచ్చరించారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
News April 3, 2025
NRPT: గ్రూప్ -1 ర్యాంకర్లను సన్మానించిన ఎండీ

నారాయణపేట ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న కార్మికుల పిల్లలు ఇటీవల విడుదలైన గ్రూప్ -1 ఫలితాల్లో ప్రతిభ చూపారు. కండక్టర్ శ్రీనివాసులు కూతురు వీణ డిప్యూటీ కలెక్టర్గా, వహీద్ కూతురు ఫాతిమినా ఫైజ్ డీఎస్పీలుగా ఎంపికయ్యారు. వారిని ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ HYDలోని తన కార్యాలయంలో శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించి అభినందించారు. తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన పేరెంట్స్‌ను అభినందించారు.
News April 3, 2025
చిత్తూరు: నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఈనెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపులను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరేళ్ల లోపు పిల్లలకు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపులకు ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మరో విడత క్యాంపులు నిర్వహించనున్నారు.