News March 1, 2025
కడిమెట్లలో జిల్లా కలెక్టర్ పర్యటన

ఎమ్మిగనూరు మండలం కడిమెట్లలో జరుగుతున్న భూ రీసర్వేను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శనివారం పరిశీలించారు. ఎమ్మార్వో శేషఫణితో కలిసి రీ సర్వేలో రైతుల నుంచి వస్తున్న సమస్యలను తెలుసుకున్నారు. మండలంలో నెలకొన్న భూ, తదితర సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News March 1, 2025
రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యం: లోకేష్

రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శనివారం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాల్లో మంత్రి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వలసల అధికంగా కొనసాగుతున్నాయని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
News March 1, 2025
కర్నూలు జిల్లాలో 611 మంది విద్యార్థుల గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 611 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23,755 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 23,144 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆయన వివరించారు.
News March 1, 2025
కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 8.30 నుంచి చెక్ చేసి లోపలికి అనుమతించారు. ఇవాళ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పేపర్ 1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతోంది. కర్నూల్ నగర వ్యాప్తంగా 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.