News May 9, 2024

కడియంకు రాజకీయ ఉనికి లేకుండా చేయాలి: ఆరూరి

image

కడియం శ్రీహరికి రాజకీయ ఉనికి లేకుండా MP ఎన్నికల్లో ఆయన కూతురు కావ్యను ఒడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వరంగల్ BJP MP అభ్యర్థి ఆరూరి రమేశ్ అన్నారు. ధర్మసాగర్ మండలంలో ఈరోజు ఆయన ప్రచారం నిర్వహించి, తనను ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. రాజకీయ భవిష్యత్తు కోసం అనేకమంది దళితులను నమ్మించి మోసం చేసిన వ్యక్తి కడియం అన్నారు. ధర్మసాగర్‌లో డిగ్రీ కళాశాల కోసం కృషి చేస్తానన్నారు.

Similar News

News January 19, 2025

ముగిసిన మావోయిస్టు దామోదర్ ప్రస్థానం!

image

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్@ <<15194613>>చొక్కారావు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రస్థానం ముగిసిందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాల్వపల్లికి చెందిన దామోదర్ గోవిందరావుపేట కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో మావోయిస్టు భావాజాలానికి ఆకర్షితుడై అడవిబాట పట్టాడు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

News January 19, 2025

UPDATE: ఆరెపల్లి వద్ద యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

WGL ములుగు రోడ్డు సమీపంలోని ఆరెపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం <<15190249>>ఓ మహిళ మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. కాగా ఇదే ప్రమాదంలో గాయపడిన మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కరీమాబాద్‌కు చెందిన కనకలక్ష్మి, సాంబలక్ష్మి చీపురు కట్టల వ్యాపారం చేసేవారు. పస్రా నుంచి చీపురు కట్టలు కొనుగోలు చేసి ఆటోలో వస్తుండగా RTC అద్దె బస్సు ఢీకొని మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 19, 2025

స్మార్ట్ సిటీ పనులు గడువు లోగా పూర్తి చేయండి: కమిషనర్

image

గ్రేటర్ వరంగల్ పరిధిలో స్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ ఎండీ, GWMC కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడే అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజినీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో స్మార్ట్ సిటీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.