News January 1, 2025
కడియం: 4న గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నెల 4న సాయంత్రం 6గంటలకు ఈవెంట్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర చిరంజీవి, రామ్ చరణ్ యువత కమిటీ సభ్యుడు ఏడిద బాబి తెలిపారు. మంగళవారం సాయంత్రం మహానాడు నిర్వహించిన మైదానాన్ని A-మీడియా ఛైర్మన్ నరేంద్ర వచ్చి పరిశీలించినట్లు ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు.
Similar News
News January 4, 2025
కాకినాడ జిల్లాలో ఎయిర్‌పోర్టుపై CM కీలక ప్రకటన
ఉమ్మడి తూ.గో జిల్లా పరిధిలో ఇప్పటికే రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కాకినాడ జిల్లాలోనూ విమానాశ్రయం రానుంది. ఈమేరకు CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అన్నవరం, తుని మధ్య ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ మేరకు ఆ ఏరియాలో 757 ఎకరాలను గుర్తించినట్లు సీఎం నిన్నటి సమీక్షలో వెల్లడించారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.
News January 4, 2025
తూ.గో: నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
జిల్లాలో 15 జూనియర్ కళాశాలలో శనివారం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. స్ధానిక జిల్లా మంత్రి దుర్గేష్, ఇతర ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న 5,425 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నారు.
News January 4, 2025
ప్రత్తిపాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్
ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంతోషి మాతా దేవాలయం వద్ద హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.