News December 16, 2025
కడెం: ఒకే కుటుంబం.. మూడు సార్లు విజయం

ఒక కుటుంబంలో సర్పంచ్‌గా ఒక్కసారి అవకాశం రావడమే కష్టంగా ఉంటే ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు సర్పంచ్‌గా గెలిచారు. కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన బొడ్డు రాజవ్వ 2013లో, 2019లో ఆమె కొడుకు గంగన్న సర్పంచ్‌గా గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య రాజేశ్వరి పోటీ చేసి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
Similar News
News December 17, 2025
ఎండపల్లి: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఎండపల్లి మండలంలోని రాజారంపల్లి, గుల్లకోట, ధర్మపురి మండలం రాయపట్నం, జైన, రాజారామ్, వెల్గటూర్ మండల కేంద్రాలలో పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీఓ మధుసూదన్ తదితర అధికారులు ఉన్నారు.
News December 17, 2025
ఓటు వేసి వెళ్తూ గుండెపోటుతో మృతి

TG: తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఓటు వేసి ఇంటికి వెళ్తుండగా నాగులవంచ సత్యనారాయణ(65) గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియనుంది.
News December 17, 2025
నాగర్‌కర్నూల్: ఉదయం 9 గంటలకే 25.70 శాతం పోలింగ్

నాగర్‌కర్నూల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా సగటున 25.70 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో ఓటింగ్ శాతంలో జోరు కనిపిస్తోంది.
చారకొండ 27.73%
అచ్చంపేట 27.45%
లింగాల 27.16%
ఉప్పునుంతల 25.80%
పడర 25.29%
అమ్రాబాద్ 25.26%
బల్మూర్ 22.04%


