News January 31, 2025

కడెం: కేంద్ర టెలికాం సలహా కమిటీ సభ్యుడిగా రమేశ్

image

ADB పార్లమెంట్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ బీఎస్ఎన్ఎల్ సలహా కమిటీ సభ్యుడిగా మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన బుర్ర రమేశ్ గౌడ్ నియామకమయ్యారు. గురువారం ఎంపీ గోడం నగేశ్ నియామకపత్రాన్ని ఆయనకు అందజేశారు. నియామకానికి కృషి చేసిన ఎంపీ నగేశ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News October 22, 2025

ఎర్రచందనం అనుకొని తనిఖీలు.. తీరా చూస్తే సండ్ర మొద్దులు..!

image

యాడికి మండలం మీదుగా ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొలిమిగుండ్ల నుంచి బుగ్గ మీదుగా యాడికికి వస్తున్న ఐచర్ వాహనాన్ని సీఐ ఈరన్న తన సిబ్బంది నిలిసి తనిఖీ చేవారు. అయితే అవి సండ్ర మొద్దులు అని గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారన్నది తెలియాల్సి ఉంది.

News October 22, 2025

నల్గొండ డీసీసీకి షార్ట్ లిస్టు రెడీ..! పీఠం దక్కేదెవరికో?

image

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నలుగురు పేర్లతో షార్ట్ లిస్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. OC గుమ్మల మోహన్ రెడ్డి, SC కొండేటి మల్లయ్య వైపు, BCలు చనగాని దయాకర్ గౌడ్, పున్న కైలాష్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా మరోవైపు నల్గొండ డీసీసీ బీసీకే అని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. బీసీ అయితే చనగాని, పున్న కైలాష్ నేత అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. దీనిపై మీ కామెంట్..?

News October 22, 2025

సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి మంచి స్పందన: కలెక్టర్

image

తెలంగాణ రైజింగ్- 2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారని చెప్పారు. 2047 నాటికి దేశ స్వాతంత్రానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్బంగా తెలంగాణ ఎలా ఉండాలో ప్రజల నుంచి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే చేపట్టిందని తెలిపారు.