News February 9, 2025
కడెం: పురుగు మందు తాగి వ్యక్తి మృతి
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి మనస్థాపం చెంది పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది.ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ..లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కొత్తూరు శంకర్(43) భూముల పంపకాల విషయంలో గొడవ జరుగగా మనస్థాపం చెందాడు. దీంతో ఈనెల 7న పురుగుల మందు సేవించాడు.ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News February 9, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఎపీఓలకు శిక్షణ
ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేశ్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News February 9, 2025
రేషన్ కార్డులపై ఏమిటీ గందరగోళం?
TG: ప్రజాపాలన, సర్వేలో వినతుల మేరకు కొత్త రేషన్ కార్డులిస్తామని ప్రభుత్వం తొలుత చెప్పింది. కానీ మీసేవలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఇంతలో EC దీనికి బ్రేక్ వేసిందని వార్తలొచ్చాయి. మరోవైపు మీసేవలో అప్లై చేసుకోవడానికి వీలులేదని సర్కార్ చెప్పింది. ఇక కార్డుల జారీకి తాము బ్రేక్ వేయలేదని EC తెలిపింది. వీటన్నింటితో ‘ఇక కార్డులు వచ్చినట్టే’ అని ప్రజలు నిట్టూరుస్తున్నారు.
News February 9, 2025
నేడు ఆత్మకూరుకు రానున్న ఐదుగురు మంత్రులు
నేడు(ఆదివారం) ఆత్మకూరులో ఐదుగురు మంత్రుల బృందం పర్యటిస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. మంత్రులు ఫరూక్, సవిత, బీసీ జనార్దన్, నారాయణ వారిలో ఉన్నారు. టిడ్కో నివాస ప్రాంతాల్లో సీతారామ ఆలయ నిర్మాణం, పంచాయతీరాజ్ నూతన అతిథి భవన నిర్మాణానికి శంకుస్థాపన, R&B నూతన అతిథిగృహ ప్రారంభం, జ్యోతిరావు ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను వారు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.