News July 22, 2024
కడెం ప్రాజెక్టు అప్డేట్.. 3380 క్యూసెక్కుల నీటి విడుదల

కడెం ప్రాజెక్టు నుంచి 3380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా సోమవారం సా. 5 గంటలకు ప్రాజెక్టులో 691.22 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ప్రాజెక్టులోకి 4855 క్యూసెక్కుల నీరు వస్తోందని, దీంతో ఒక గేటు ఎత్తి ఎడమ కాలువకు 298, కుడి కాల్వకు 8, గోదావరిలోకి 2,997 క్యూసెక్కులు మొత్తం 3,380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు.
Similar News
News September 7, 2025
గ్రామ పంచాయతీ అధికారుల పాత్ర కీలకం: కలెక్టర్

గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీ అధికారుల(జీపీఓ) పాత్ర చాలా కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కొత్తగా నియామక పత్రాలు పొందిన 83 మంది జీపీఓలతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి అధికారి తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.
News September 7, 2025
ADB: నిమజ్జనం ప్రశాంతంగా చేయాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను జిల్లా ప్రజలు ప్రశాంతంగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి, నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూచనలిచ్చారు. ప్రజలతో మర్యాదగా మాట్లాడి, సామరస్యంగా వ్యవహరించాలని ఆయన కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, 24 గంటలు కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.
News September 6, 2025
ADB: ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం: ఎస్పీ అఖిల్ మహాజన్

గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా పూర్తి చేయడానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆయన పోలీసులకు పలు సూచనలు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు.