News August 16, 2025

కడెం ప్రాజెక్ట్ దిగువ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వర్షాలు అధికంగా కురిసి, ప్రాజెక్టు గేట్లను ఎత్తినందున.. కడెం ప్రాజెక్టు దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోకి పశువుల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల, స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News August 16, 2025

GET READY: 4.05 PMకి OG నుంచి అప్డేట్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ నుంచి మరో అప్డేట్ రానుంది. ఈ చిత్రంలోని ‘కన్మని’ సాంగ్‌ను ఈరోజు సాయత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రెడీగా ఉండాలంటూ ఫ్యాన్స్‌కు సూచించారు. ప్రియాంక మోహన్, పవన్ మధ్య ఈ సాంగ్ సాగుతుందని హింట్ ఇచ్చారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే.

News August 16, 2025

తెనాలి: అవయవదానం.. ఏడుగురికి ప్రాణదానం

image

తెనాలి (M) సోమసుందరపాలెంకు చెందిన సుబ్బరాజు(62) తాను మరణించి కూడా ఏడుగురికి ప్రాణాలిచ్చారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు శనివారం తెల్లవారుజామున బ్రెయిన్‌ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. ఓ ట్రస్ట్ ద్వారా ఆయన అవయవాలను దానం చేశారు. తహశీల్దార్ గోపాలకృష్ణ మృతుడి కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేసి, సత్కరించారు.

News August 16, 2025

అవసరమున్న మేరకే యూరియా తీసుకోండి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలో యూరియా నిల్వలు బాగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం తెలిపారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ అధికారులతో యూరియా పంపిణీపై సమీక్షలో నిల్వ చేసుకోకుండా ప్రస్తుత అవసరానుసారమే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. యూరియా అందని రైతుల వివరాలు అధికారులు సేకరించి వారికి అందించాలన్నారు. అక్రమ విక్రయాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.