News September 12, 2025
కడెం వరద గేట్లు ఎత్తే అవకాశం

కడెం పరివాహక ప్రాంతంలో( క్యాచ్మెంట్) వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉన్నందున శుక్రవారం రాత్రి కడెం ప్రాజెక్టు వరద గేట్లు నుంచి నీళ్లను వదిలే అవకాశం కడెం ప్రాజెక్టు నాల్గవ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు.
నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులు, గొర్రెలు వెళ్లకుండా చూడాలన్నారు. పశువుల కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News September 13, 2025
‘పెద్దారెడ్డి ఇంటికి కొలతలు.. 2 సెంట్ల ఆక్రమణల గుర్తింపు’

తాడిపత్రిలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు శుక్రవారం సర్వే చేశారు. పెద్దారెడ్డి భవనానికి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ లేనట్లు గుర్తించారు. 12 సెంట్లలో ఇంటి నిర్మాణం చేపట్టగా.. 2 సెంట్లు ఆక్రమణలకు పాల్పడినట్లు టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత చెప్పారు. సర్వే నివేదిక పంచనామాపై సంతకం చేయమని కోరగా పెద్దారెడ్డి నిరాకరించినట్లు అధికారులు తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.
News September 13, 2025
నకిలీ ఏపీకే ఫైళ్ల జోలికి వెళ్లొద్దు: కర్నూలు ఎస్పీ

జిల్లా ప్రజలు నకిలీ ఏపీకే ఫైళ్లకు దూరంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాట్సాప్‌లో ఆర్టీవో ఛలాన్, ఎస్బీఐ రివార్డ్స్, పీఎం కిసాన్ పేర్లతో వచ్చే నకిలీ ఫైళ్లను క్లిక్ చేయవద్దని సూచించారు. వీటిని ఇన్‌స్టాల్ చేస్తే బ్యాంక్ ఖాతా వివరాలు హ్యాకర్లకు చేరడంతో పాటు, వాట్సాప్ కూడా హ్యాక్ అవుతుందని పేర్కొన్నారు.
News September 13, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.