News December 27, 2025
కడెం: 4 రోజులైతే రిటైర్మెంట్.. హెచ్ఎం మృతి

కడెం మండలంలోని లింగాపూర్ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం గట్ల నర్సయ్య(61) అనారోగ్యంతో మృతి చెందారు. నర్సయ్య గత కొన్ని రోజులుగా కాన్సర్‌తో బాధపడుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పదవీ విరమణకు నాలుగు రోజుల ముందే నర్సయ్య మృతి చెందడంతో మండలంలోని పలువురు ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు.
Similar News
News December 29, 2025
NGKL: యాసంగి పంటకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి: మంత్రి

జిల్లాలో యాసంగి పంటకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బదావత్ సంతోష్‌తో పాటు అదనపు కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో యాసింగి పంట ఏర్పాట్లపై జిల్లా అధికారులు మంత్రికి వివరించారు.
News December 29, 2025
SP హెచ్చరిక.. నిబంధనల మధ్యే న్యూ ఇయర్‌కి స్వాగతం

నూతన సంవత్సర వేడుకలను పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. వేడుకల పేరుతో రోడ్లపై హంగామా చేసినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ నిఘా ఏర్పాటు చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.
News December 29, 2025
వీరిని పెళ్లి చేసుకుంటే రూ.లక్ష ప్రోత్సాహకం!

దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి కోసం అందించే వివాహ ప్రోత్సాహక పథకాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దివ్యాంగులు సాధారణ వ్యక్తులను లేదా మరో దివ్యాంగుడిని వివాహం చేసుకుంటే ప్రభుత్వం రూ. లక్ష ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. అర్హులైన వారు వివాహమైన ఏడాదిలోపు <


