News February 5, 2026
కత్తిపూడిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

కత్తిపూడి శివారు లారీ పార్కింగ్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రాజమండ్రి నుంచి తుని వెళ్తున్న లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో కత్తిపూడికి చెందిన ఈసరపు దుర్గాప్రసాద్, కోన రామకృష్ణ, ఈసరుపు సూర్య వీరబాబులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వీరబాబును కాకినాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 15, 2026
INDvsPAK: టాస్ గెలిచిన పాక్.. భారత్ బ్యాటింగ్

T20WCలో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కొలంబో వేదికగా కాసేపట్లో INDతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లోనూ ఇరు జట్ల కెప్టెన్లు సూర్య, సల్మాన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.
IND: అభిషేక్, ఇషాన్, తిలక్, సూర్య, హార్దిక్, దూబే, రింకు, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా
PAK: అయూబ్, ఫర్హాన్, సల్మాన్, బాబర్, నవాజ్, షాదాబ్, ఫహీమ్, ఉస్మాన్, షాహీన్, అబ్రార్, తారిఖ్
News February 15, 2026
ఉండవల్లిలో సీఎం పర్యటన.. పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్

సోమవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి ఉండవల్లి పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని చెప్పారు.
News February 15, 2026
రేపు ప్రజావాణి రద్దు: నిర్మల్ కలెక్టర్

నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల దృష్ట్యా ఈ వారం ప్రజావాణిని రద్దు చేశామన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.


