News March 31, 2025

కథలాపూర్‌లో ఉరేసుకొని యువతి ఆత్మహత్య

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఆకుల శృతి (28) అనే యువతి సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. శృతి పీజీ చదివి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. శృతి గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆసుపత్రిలో చికిత్సలు చేయించిన నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.

Similar News

News July 6, 2025

శ్రీకాకుళం జిల్లాలో యువకుడు దారుణ హత్య

image

కొత్తూరు మండలం వసప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు (21) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ చింతాడ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.

News July 6, 2025

కన్నాయిగూడెం: మత్స్యకారుల వలకు చిక్కిన దెయ్యం చేప

image

కన్నాయిగూడెం మండలంలోని మత్స్యకారుల వలకు ఓ వింత చేప చిక్కింది. దీంతో జాలర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దెయ్యం చేపగా పిలుచుకునే ఈ చేప తినడానికి, ఔషధాల తయారీకి కూడా పనికిరాదని మత్స్యకారులు తెలిపారు. కాగా, ఈ చేప నదిలో, చెరువులో ఎక్కడున్నా మిగతా చేపలను, వాటి గుడ్లను తినడం వంటి లక్షణాలున్న ప్రమాదకరమైన చేప అన్నారు. ఈ చేపలు ఉన్నచోట మిగతా చేపలు కూడా ఎదుగుదల ఉండదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

News July 6, 2025

మరో ఘోరం.. భర్తను చంపిన భార్య

image

TG: NZB(D) బోధన్(మ) మినార్‌పల్లి గ్రామంలో <<16952152>>మరో దారుణం <<>>జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసింది. భర్త దేశ్యనాయక్(57) మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీనిపై పలుమార్లు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, శుక్రవారం కూడా వివాదం తలెత్తింది. దీంతో కత్తితో భర్తపై దాడి చేసి గొంతులో పొడిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.