News February 1, 2025
కథలాపూర్: తపాలా జీవిత పథకం ప్రవేశపెట్టి 141 ఏళ్లు
తపాలా శాఖ ఆధ్వర్యంలో తపాలా జీవిత బీమా పథకం ప్రవేశపెట్టి ఫిబ్రవరి 1 నాటికి 141 ఏళ్లు పూర్తయిందని తపాలా శాఖ ఉమ్మడి కరీంనగర్ పోస్టల్ సూపరింటెండెంట్ శివాజీ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలోని తపాలా శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. తపాలా బీమా పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఆయన వెంట సబ్ పోస్ట్ మాస్టర్ జయరాం ఉన్నారు.
Similar News
News February 2, 2025
షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ?
AP: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో YCP మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. 3 రోజుల కిందట హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో దాదాపు 3 గంటల పాటు సమావేశం అయినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు వినికిడి. ఇటీవల వైసీపీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన VSR షర్మిలతో రహస్యంగా భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
News February 2, 2025
ఉప్పు గనుల్లో ఉంచి చికిత్స చేస్తారు!
ఆస్తమా రోగులకు వినూత్నంగా చికిత్స అందిస్తోంది ఉక్రెయిన్. అక్కడున్న ఉప్పు గనుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసార్ట్ ఉబ్బసం రోగులకు ట్రీట్మెంట్ ఇస్తోంది. గనిలోని అధిక ఉప్పు సాంద్రత ఒక మైక్రోక్లైమేట్‌ను సృష్టించి ఊపిరితిత్తులను పొడిగా ఉంచడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. రోగులు గనిలోనే కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు.
News February 1, 2025
భారీగా పెరిగిన జీఎస్టీ కలెక్షన్లు
దేశంలో జనవరి నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. 12.3శాతం పెరిగి రూ.1,95,506 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ రూ.1.47 లక్షల కోట్లు కాగా, దిగుమతి వస్తువులపై విధించిన పన్నులతో వచ్చిన ఆదాయం రూ.48,382 కోట్లుగా ఉంది. రీఫండ్స్ కింద రూ.23,853 కోట్లు విడుదల చేయగా, చివరకు వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి.