News April 18, 2025

కథలాపూర్ పీహెచ్సీలో అగ్నిప్రమాదం.. రూ.25 లక్షల ఆస్తినష్టం

image

కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాక్సినేషన్ గదిలో శుక్రవారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో రూ.25 లక్షలు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వాక్సినేషన్ గదిలోని నాలుగు ఫ్రిడ్జ్లు, వాక్సిన్లు పూర్తిగా కాలిపోయాయి. 

Similar News

News December 26, 2025

డీలిమిటేషన్‌: GHMCలో కొత్తగా 6 జోన్లు

image

TG: GHMC డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జోన్లు, సర్కిళ్లు, డివిజన్ల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 60కి, డివిజన్లను 300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్‌లను కొత్త జోన్లుగా పేర్కొంది.

News December 26, 2025

సిరిసిల్ల: కాంగ్రెస్ జిల్లా నూతన కార్యవర్గానికి దరఖాస్తుల ఆహ్వానం

image

కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గ పదవుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 26న శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు కాంగ్రెస్ కార్యాలయంలో PCC అబ్జర్వర్లు ఫక్రుద్దీన్, కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సంగితం శ్రీనివాస్ అందుబాటులో ఉంటారు. ఆసక్తి గల వారు ఓటర్ IDతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని దరఖాస్తు చేసుకోవాలని పార్టీ PRO తెలిపారు.

News December 26, 2025

జనగామ జిల్లాలో టాప్ న్యూస్

image

> ఈనెల 31న పాలకుర్తి సోమేశ్వరాలయంలో బహిరంగ వేలం: ఈవో
> బచ్చన్నపేట: గుండెపోటుతో జిపిఓ మృతి
> జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు
> జిల్లాలో యూరియా కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్న రైతన్నలు
> రేపు కట్కూర్ లో పామాయిల్ సాగుపై అవగాహన సదస్సు
> జనగామ: మహిళ కబడ్డీ టీం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లేయింగ్ కిట్లను పంపిణీ చేశారు.