News November 26, 2025
కదిరిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

కదిరి టౌన్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ షెడ్ పక్కన చింతచెట్ల కింద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని స్థానికులు అంటున్నారు. అతని ఒంటిపై తెలుపు రంగు టీషర్టు, నలుపు రంగు ప్యాంటు ఉంది. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందని పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు 94407 96851కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.
Similar News
News November 27, 2025
వనపర్తి: ‘ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలి’

ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి జిల్లా ఎస్పీలను వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. నామినేషన్ నుంచి ఫలితాల వరకు అప్రమత్తంగా ఉండాలని, రౌడీషీటర్లు, రిస్క్ ఎలిమెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల: కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్ గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్, మీడియా సెంటర్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదుల వివరాలను ఆరా తీశారు. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కచ్చితంగా రికార్డులో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.