News March 20, 2025

కదిరిలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

image

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం దృష్ట్యా గురువారం కదిరిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. నేటి సాయంత్రం నుంచి గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు కదిరి పట్టణ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. అనంతపురం, హిందూపురం ప్రాంతాలకు వెళ్లే వాహనాలు కుటాగుళ్ల, కొత్త బైపాస్ మీదుగా బెంగళూరు వైపు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

Similar News

News March 20, 2025

పారిశ్రామిక విధానాలపై ప.గో అధికారులకు అవగాహన 

image

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కలల సాకారంలో భాగంగా ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికవేత్తలు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు,ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వివిధ పారిశ్రామిక విధానాల గురించి అధికారులకు అవగాహన కల్పించారు.

News March 20, 2025

ఒకే ఫ్రేమ్‌లో కెప్టెన్లు

image

ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆవిష్కరించారు. ఐపీఎల్ ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్లు గ్రూప్ ఫొటో దిగారు. కెప్టెన్లు కమిన్స్, అయ్యర్, గిల్, పంత్, రుతురాజ్, హార్దిక్, పాటిదార్, శాంసన్, రహానే, అక్షర్ పటేల్ ఫొటోషూట్‌లో సందడి చేశారు. కాగా ఎల్లుండి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. 65 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం 74 మ్యాచులు జరగనున్నాయి.

News March 20, 2025

‘CSR నిధులతో చెరువుల అభివృద్ధి’

image

ఔట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలో చెరువుల అభివృద్ధికి ఉన్న ఆటంకాల‌న్నీ తొల‌గిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. CSR నిధుల‌తో కార్పొరేట్, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ముందుకు రావాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ 72 సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు సూచించారు. చెరువుల సుంద‌రీక‌ర‌ణ‌కే ప‌రిమితం కారాద‌ని, చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయ‌డంపై దృష్టి పెట్టాల‌ని సంస్థ‌ల‌కు సూచించారు.

error: Content is protected !!