News January 22, 2026

కదిరిలో మహిళ ఆత్మహత్య

image

కదిరిలో మున్ని అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నారాయణరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Similar News

News April 4, 2026

ముందస్తు బడిబాట.. విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యం!

image

పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 31 పీఎంశ్రీ పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఉచిత, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్ ఇస్తున్నారని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారని చెబుతున్నారు.

News April 4, 2026

శ్రీ తిరుపతమ్మ దేవస్థానానికి నోటీసులు

image

పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ ఆలయానికి రూ. 8.90 లక్షలు ఇంటి పన్ను చెల్లించాలని గ్రామపంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 3 ఏళ్లుగా దేవస్థానంలో ఉన్న వివిధ రకాల భవనాలకు ఇంటి పన్ను పెండింగ్లో ఉంది. పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు 4 రోజులుగా ఆయజ అధికారుల చుట్టూ తిరిగినా స్పందించలేదు. నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో పంచాయతీ అధికారులు చేసేదేమీ లేక కార్యాలయం గోడకు అంటించారు.

News April 4, 2026

కాకినాడ: లక్షలు కుమ్మరించినా లక్ష్మి కటాక్షం లేని ‘మహిళా మార్ట్‌లు’

image

డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మహిళా మార్ట్‌లు’ లక్ష్యానికి దూరమవుతున్నాయి. యు.కొత్తపల్లి, తాళ్లరేవుల్లో డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం రూ.లక్షల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ‘మహిళా మార్ట్‌లు’ నిధుల వృథాకు నిదర్శనంగా మారాయి. సరుకుల నిల్వలు లేక, సరైన పర్యవేక్షణ కరువై అమ్మకాలు సాగడం లేదని మహిళలే వాపోతున్నారు. కలెక్టర్ స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.