News February 15, 2025

కదిరిలో విద్యార్థిని కొట్టిన టీచర్‌పై కేసు

image

కదిరిలో విద్యార్థిని కొట్టిన టీచర్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. నల్లగుట్టవీధికి చెందిన అశ్విని కుమారుడు భానుతేజ ఓ ప్రవేటు స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నారు. స్కూల్‌లో టీచర్ మధు అడిగిన ప్రశ్నకు తన కుమారుడు సమాధానం చెప్పలేదని కర్రతో కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయాలయ్యాయని చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

Similar News

News October 31, 2025

NLG: శిశు విక్రయాలకు అడ్డుకట్టపడేదెప్పుడో!

image

జిల్లాలో శిశు విక్రయాలు కలకలం రేపుతున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, అధిక సంతానం కారణంగానే జిల్లాలో ఎక్కువగా గిరిజన తండాల్లో శిశు విక్రయ ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. ఎవరికీ తెలియకుండానే పసిపిల్లల విక్రయాలు సాగుతున్నాయన్న చర్చ జరుగుతోంది. జిల్లాలో 2020 నుంచి ఇప్పటివరకు సుమారుగా 52 శిశు విక్రయాలు జరిగినట్లు తెలుస్తుంది. శిశువిక్రయాలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

News October 31, 2025

పెదకాకాని మండలం తెనాలి డివిజన్‌లోకి.?

image

జిల్లా పునర్విభజనపై క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ప్రకారం పెదకాకాని మండలం తెనాలి రెవెన్యూ డివిజన్‌లోకి మారే అవకాశం ఉందని సమాచారం. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే డివిజన్‌లో ఉండాలన్న ప్రభుత్వ ఆలోచనతో ఈ మార్పు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గం గుంటూరు, తెనాలి డివిజన్‌లలో విభజింపబడి ఉండటంతో పెదకాకాని మార్పుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

News October 31, 2025

జగిత్యాలలో ఉత్సాహంగా “Run For Unity”

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా Run For Unity కార్యక్రమం ఘనంగా జరిగింది. SP అశోక్ కుమార్ పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు, క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. SP మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ ఐక్యత సూత్రధారి అన్నారు. సమాజంలో ఐక్యత, సామరస్యం నెలకొల్పాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతలతో పాటు జాతీయ స్ఫూర్తిని పెంపొందించాలన్నారు.