News July 5, 2024

కదిరిలో వైసీపీ కార్యకర్తలపై కేసు

image

కదిరిలో నడిరోడ్డుపై బాహాబాహీకి దిగిన వైసీపీలోని ఇరువర్గాల కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన వద్ద అప్పుగా తీసుకున్న రూ.5 లక్షలు తిరిగివ్వాలని అడిగినందుకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అంజాద్, ఖాజా తనను అపహరించి చంపేందుకు యత్నించారని సూర్యశేఖర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బలవంతంగా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా తన మిత్రులు కాపాడారని తెలిపాడు. ఈ ఘటనలో ఇరువర్గాలపై కేసు నమోదైంది.

Similar News

News July 7, 2025

అనంతలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిప్పే స్వామి (52) సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బెళుగుప్ప మండలం ఎర్రగుడికి చెందిన తిప్పేస్వామి ఆదివారం కణేకల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 7, 2025

పామిడిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

పామిడిలోని జగన్నాథ పద్మావతి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

News July 7, 2025

‘రాష్ట్రంలో అనంత జిల్లా మొదటి స్థానంలో నిలవాలి’

image

మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని రికార్డ్ సృష్టించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 10న సత్య సాయి జిల్లాలో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.