News December 30, 2025

కదిరిలో శ్రీవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

image

కదిరిలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం, భక్తుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఆర్డీవో శర్మ, ఈఓ శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్‌కు ఘనస్వాగతం పలికారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

Similar News

News February 6, 2026

స్మృతి మంధాన ‘రాయల్’ విజయం!

image

వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులకు కుంగిపోకుండా, పట్టుదలతో పోరాడి RCBని మరోసారి విజేతగా నిలిపారు స్మృతి మంధాన. మానసిక వేదనను పక్కన పెట్టి, మైదానంలో పరుగుల వరద పారిస్తూ ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకోవడం ఆమె సంకల్పానికి నిదర్శనం. పడిలేచిన కెరటంలా పుంజుకున్న ఆమె ప్రయాణం.. నిరాశలో కూరుకుపోతున్న ఎందరికో ఆదర్శం. ఈ విజయం కప్పు మాత్రమే కాదు, ఆమె ఆత్మవిశ్వాసానికి అభిషేకం.. మనోనిబ్బరానికి మరో మజిలీ.!

News February 6, 2026

జగిత్యాల: అది చిరుత కాదు.. అడవి నక్కే!

image

ఎండపల్లి మండల సమీప గ్రామాల్లో చిరుత పులి సంచరిస్తోందన్న వార్తలు అవాస్తవమని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు, పొలాల్లో లభించిన పాదముద్రలు చిరుతవి కాదని, అవి అడవి నక్కకు సంబంధించిన పాదముద్రలుగా గుర్తించినట్లు తెలిపారు. దీంతో ప్రజలు, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

News February 6, 2026

ముహూర్తం కోసం చూస్తున్నా.. 3 నెలల్లో పార్టీ ప్రకటన: కవిత

image

TG: పార్టీ ప్రకటనపై జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ‘నాకు సెంటిమెంట్ ఎక్కువ. మంచి ముహూర్తం కోసం చూస్తున్నా. 3 నెలల్లో పార్టీని ప్రకటిస్తా. సిరిసిల్లలో 16 మంది BRS నేతలు టికెట్ కోసం మమ్మల్ని కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో KTR, హరీశ్‌రావు కేవలం జాగృతి బరిలో ఉన్న చోటే తిరుగుతున్నారు. ఇతర జిల్లాల్లో ఎందుకు ప్రచారం చేయట్లేదో చెప్పాలి’ అని పేర్కొన్నారు.