News December 24, 2025
కదిరి ఆలయంలో సర్వమత ప్రార్థనలపై వీహెచ్‌పీ ఆగ్రహం

కదిరి నారసింహుని ఆలయంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్యమత ప్రార్థనలు చేయించడాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండించింది. శాస్త్ర విరుద్ధంగా క్రైస్తవ పాస్టర్, ముస్లిం మౌల్వీలతో ప్రార్థనలు చేయించడం హిందూ ధర్మానికి అపచారమని వీహెచ్‌పీ నేత సత్య రవికుమార్ మండిపడ్డారు. ఆలయాలు సెక్యులర్ కేంద్రాలు కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఆలయ పవిత్రతను దెబ్బతీయడం తగదన్నారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 29, 2025
ఇండియా ‘విశ్వ గురువు’ కావాలి: RSS చీఫ్

ప్రపంచ సంక్షేమం కోసం హిందువులు భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలని అన్నారు. ‘ప్రపంచం మన వైపు చూస్తోంది. భారత్ విశ్వ గురువు కావడం మన ఆశయం కాదు.. ప్రపంచానికి అవసరం. ఇందుకు చాలా కష్టపడి పని చేయాలి’ అని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన విశ్వ సంఘ్ శిబిర్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
News December 29, 2025
శ్రీ సత్యసాయి: ఎన్నికలు ఏకగ్రీవం

శ్రీ సత్యసాయి జిల్లా రెవెన్యూ అసోసియేషన్ జిల్లా శాఖా ఎన్నికలు కలెక్టరేట్‌లో ఆదివారం జరిగినట్లు ఎన్నికల అధికారి దివాకర్ రావు వెల్లడించారు. హిందూపురం డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయ డీటీ గిరిధర్ అసోసియేట్ అధ్యక్షుడిగా, పుట్టపర్తి డీటీ కళ్యాణ చక్రవర్తి కార్యదర్శిగా, సోమందేపల్లి డీటీ శ్రీకాంత్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
News December 29, 2025
‘స్పిరిట్’ నుంచి న్యూఇయర్ సర్‌ప్రైజ్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల ఫొటో షూట్ పూర్తి చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఆదివారం ‘రాజాసాబ్’ రెండో ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. కానీ విడుదల కాలేదు.


