News December 23, 2025

కదిరి: గర్భిణిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్త అరెస్ట్

image

శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలపల్లిలో గర్భిణిపై దాడి చేసిన <<18637801>>వైసీపీ<<>> కార్యకర్త అజయ్ దేవ్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున టపాసులు పేల్చుతుండగా వద్దని కోరిన గర్భిణి సంధ్యారాణిపై అజయ్ దాడి చేశాడు. ఆమెను కాలుతో తన్నడంతో అస్వస్థతకు గురయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

Similar News

News December 26, 2025

బిల్లు కన్నా ఎక్కువ తీసుకుంటే చర్యలు: జేసీ

image

వంట గ్యాస్ డెలివరీ సమయంలో ఛార్జీల పేరుతో వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ హెచ్చరించారు. శుక్రవారం మహిళలకు ఉచిత గ్యాస్ పంపిణీ, రేషన్ సరుకుల పంపిణీపై అధికారులతో సమీక్షించారు. వంట గ్యాస్ అందించే డెలివరీ బాయ్స్ ప్రతి వినియోగదారునితో మర్యాదగా ప్రవర్తించేలా డీలర్లు పర్యవేక్షించాలని, రసీదు కంటే ఒక్కరూపాయి డిమాండ్ చేసినా, వసూలు చేసినా చర్యలు తప్పవన్నారు.

News December 26, 2025

కొండగట్టు యాక్సిడెంట్.. కేసు నమోదు

image

కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తాపడి నలుగురికి గాయాలైన ఘటనలో తన భర్త విద్యాధర్ కారణమని గోదావరిఖనికి చెందిన శీదురు సరస్వతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ప్రయాణిస్తున్న ఆటోను తమ భర్త విద్యాధర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి ఆటోను బోల్తా కొట్టించగా, అందులో ప్రయాణిస్తున్న తన కొడుకు, కూతురు, భర్తతో పాటు తనకు గాయాలైనట్టు PSలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విద్యాధర్ పై కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News December 26, 2025

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో ఆమెను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. వీర్ బాల్ దివస్ సందర్భంగా పలు రంగాలలో రాణించిన, ధైర్యసాహసాలు ప్రదర్శించిన 19 మంది పిల్లలకు ఇవాళ ఉదయం ప్రధాన మంత్రి <<18676177>>రాష్ట్రీయ బాల్ పురస్కార్<<>> అవార్డులను రాష్ట్రపతి అందజేసిన సంగతి తెలిసిందే.