News March 23, 2025

కదిరి: ప్రేమ పేరుతో మోసం.. కేసు నమోదు

image

కదిరికి చెందిన మనోహర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేశాడని, నిజాంవళి కాలనీకి చెందిన షేక్ సోనీ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.18 లక్షల రుణాలను తన పేరుతో వివిధ బ్యాంకుల్లో పొందాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటిని తిరిగి చెల్లించకుండా, తనను బెదిరిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News July 6, 2025

కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం: కె.కె రాజు

image

వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో గాజువాక జగ్గు జంక్షన్ వద్ద ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ’ పేరుతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మాట్లాడారు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. పథకాలు అమలులో పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News July 6, 2025

కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజావాణి

image

కామారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటల నుంచి 1 వరకు ఉంటుందని చెప్పారు. ప్రజలు నేరుగా ప్రజావాణికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 6, 2025

పెద్దేముల్: ‘చదువు మధ్యలో మానేసిన యువతకు అవకాశం’

image

చదువుకోవాలని ఆశ ఉండి, చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ సొసైటీ సువర్ణ అవకాశాలను కల్పిస్తుందని పెద్దేముల్ GHM సునీత పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో 25 ఓపెన్ స్కూల్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. పదో తరగతిలో చేరేందుకు 14 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న వారు, ఇంటర్‌లో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.