News February 18, 2025
కనకగిరి ఫారెస్ట్‌లో నిపుణుల పర్యటన

కనకగిరి ఫారెస్ట్‌లో వన్యప్రాణి నిపుణులు 12గంటల పాటు కాలినడకన పర్యటించారు. 12 మంది నిపుణులు 4 కి.మీ.ల అడవిని పరిశీలించి వృక్షాలు, జంతువులకు సంబంధించిన వైవిధ్యాన్ని కనుగొన్నారు. 65 పక్షిజాతులు, 5 క్షీరద జాతులు, 5 చేప జాతులను డాక్యుమెంటరీ రూపంలో రికార్డు చేశారు. ఫారెస్ట్ ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణుల రకాలు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News December 29, 2025
తిరుమలకు చేరుకున్న తెలంగాణ సీఎం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు సోమవారం రాత్రి చేరుకున్నారు. గాయత్రి అతిథి భవనం వద్ద మంత్రులు కేశవులు, అచ్చెన్న, టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. బస ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం వేకువజామున సీఎం రేవంత్ రెడ్డి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు.
News December 29, 2025
యాదాద్రి కొండపైకి ఉదయం 3.30ని.ల నుంచి ఉచిత బస్సు సౌకర్యం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్థానికులకు, భక్తులకు కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. ఉదయం గం.3.30ని.ల నుంచి సాయంత్రం 6:00 వరకు వైకుంఠ ద్వారం నుండి కొండపైకి చేరుకొనుటకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే స్థానికులకు సాయంత్రం 3:30లకు అంతరాలయ దర్శనం కల్పించారు. భక్తులు సద్వినియోగించుకోవాలని కోరారు.
News December 29, 2025
మంచిర్యాల: ఆడుకోవద్దన్నందుకు విద్యార్థి సూసైడ్

ఆటలు ఆడుకునేందుకు వెళ్లవద్దన్నందుకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దండేపల్లి మండలానికి చెందిన శ్రీదేవి-నారాయణ దంపతుల చిన్న కుమారుడు ఆకర్ష్ సోమవారం స్నేహితులతో ఆడుకునేందకు వెళ్తుంటే తల్లి అడ్డుచెప్పింది. ఆటలు మానేసి చదువుకొమ్మని చెప్పినందుకు మనస్తాపంతో ఆకర్ష్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.


